Featured Post

ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి ?

చిత్రం
ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా కొంచం స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉండాలి. ఇండియా స్టాక్ మార్కెట్ లో ముక్యంగా రెండు స్టాక్ ఎక్స్చైంజెస్ ఒకటి బి‌ఎస్‌ఈ మరొకటి ఎన్‌ఎస్‌ఈ, బి‌ఎస్‌ఈ అంటే బాంబె స్టాక్ ఎక్స్చైంజ్, అలాగే ఎన్‌ఎస్‌ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చైంజ్ ఈ రెండు స్టాక్ ఎక్స్చైంజెస్ లో వివిద రకాల ఇండెక్సెస్ ఉంటాయి, వాటిలో ముక్యమైన ఇండెక్సెస్ సెన్సెక్స్ మరియు నిఫ్టీ, బి‌ఎస్‌ఈ లో ఉన్న కంపనీలలో మార్కెట్ కాపిటల్ ప్రకారంగా మొదటి 30 కంపెనీలను కలిపి సెన్సెక్స్ ఇండెక్స్ అంటారు. అలాగే మార్కెట్ కాపిటల్ ని ఆదారంగా నిఫ్టీ లోని మొదటి 50 కంపెనీలను కలిపి నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారు. స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50  నే కాకుండా వివిద రకాల ఇండెక్స్ లు ఉంటాయి వాటి గురించి రాబోయే ఆర్టికల్స్ లో తెలపడం జరుగుతుంది.  ఈ ఆర్టికల్ లో నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఉన్న కంపెనీల జాబితాను పొందుపరిచాం గమనించండి. నిఫ్టీ 50 లో ఉన్న కంపెనీల జాబితా: ( మీరు రిసర్చ్ చెయ్యడానికి సులబతరంగా ఉండడం కోసం కంపెనీల పేర్లను ఆంగ్లం లోనే ఉంచడం జరిగింది) 1.Reliance Industries Ltd. 2.HDFC Bank Ltd. 3.Infosys Ltd. 4.Hou

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఎలా ?



మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి :

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మొదటగా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ అంటే ఎక్కడైతే కంపెనీల వాటాలు అమ్మకం మరియు కొనుగోలు జరుగుతాయో దానినే స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ లో వివిధ కొంపనీల వాటాలు అంధుబాటులో ఉంటాయి. ప్రతి కంపెనీ యొక్క వాటా కి ఒక్కో ధర ఉంటుంది. ఎవరైనా ఆ కంపెనీ లో పెట్టుబడి పెట్టాలంటే ఆ కంపెనీ యొక్క వాటాలను లేదా షేర్లను కొనుక్కోవాలి. సాధారణంగా చాలామంది అనుభవజ్ఞులైన వర్తకులు రోజూ వారి వర్తకం చేస్తుంటారు దీనినే ఇంట్రాడే ట్రేడింగ్ అని కూడా అంటారు. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టె మదుపరుల యొక్క ముక్య ఉద్ధేశం వివిద రకాల  కొంపనీల యొక్క వాటాలను తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి అమ్మడం.

అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు ఎక్కువ రిస్క్ కలిగిఉంటాయి కావున చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి బయపడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో సరసారిగా పెట్టుబడి పెట్టడం రిస్క్తో తో  కూడుకున్న పని అని బావించేవాళ్ళకి అలాగే ధీర్గకాలికంగా సంపదని పెంచుకోవాలి అనుకునేవారికి వున్న మరో అవకాశం మ్యూచువల్ ఫండ్స్.

మ్యూచువల్ ఫండ్స్ ని పేరు పొందిన సంస్థలు మ్యానేజ్ చేస్తుంటాయి. SBI లాంటి సంస్తలుకూడా పలురకాల మ్యూచువల్ ఫండ్స్  ని నడుపుతున్నాయి వాటిలో కొన్ని ఎస్‌బి‌ఐ స్మాల్ క్యాప్ ఫండ్ మరియు ఎస్‌బి‌ఐ లాంగ్ టర్మ్  ఈక్విటీ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ మనం పెట్టుబడి చేసే డబ్బులను నిపుణుల పరివేక్షణ ద్వారా పలురకాల కొంపనీలలో పెట్టుబడి చేస్తాయి. 

SIP అంటే ఏంటి :

 మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టుబడి రెండు విధాలుగా చేయవచ్చు, ఒకటి {LUMPSUM} అంటే ఒకేసారి పెద్ధ మొత్తం లో పెట్టుబడి పెట్టడం, ఒకే సారి పెట్టుబడి పెట్టలేనివారు అలాగే ప్రతినెలా కొంచం డబ్బులు జమ చేయాలనుకునేవారు SIP ఆప్షన్ ఎంచుకుంటారు. సిప్ లేదా SIP అంటే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ సాధుపాయం ద్వారా ప్రతి నెల కొంచం మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ ధీర్గకాలికంగా మంచి మొత్తాన్ని పొందవచ్చు. స్టాక్ మార్కెట్ తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్ లో కాస్త రిస్క్ తక్కువ ఉంటుంది.

స్టాక్ మార్కెట్ లో వున్నంత రిస్క్ లేనప్పటికి కొంతవరకు రిస్క్ అయితే ఉంటుంది కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ధీర్గకాలికంగా పెట్టుబడి చేస్తే మాత్రం ఎక్కువ మొత్తం లో డబ్బును జమ చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టలంటే ఏమి చెయ్యాలి :

సాదారణంగా చాలామంది మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కి వెళ్ళి పెట్టుబడి పెడుతుంటారు కానీ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ పెద్ద నగరాలలో మాత్రమే అందుబాటులో వుంటాయి. చిన్న నగరాలు మరియు పట్టణాలలో ఇవి అందుబాటులో లేనందువల్ల చాలామంది ఇలాంటి మంచి అవకాశాలను కోల్పోతున్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజి పెరిగినందువల్ల మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కి వెల్లనవసరం లేకుండా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. GROWW యాప్ ద్వారా  మీ యొక్క మొబైల్ ఫోన్ వుపయోగించుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు అది ఎలా అంటే 

1. మొదటగా GROWW APP ని ఇంస్టాల్ చేసుకోవాలి. గ్రో యాప్ ని డౌన్లోడ్ చేయడానికి ఈ (Download Groww) లింక్ పై క్లిక్ చేయండి.

2. మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్ ఉప్ అవ్వండి.

3. తరువాత స్టెప్స్ లో మీకు సంబంధించిన సమాచారాన్ని ఎంటర్ చేయండి.

4. తరువాత DONE పై క్లిక్ చెయ్యండి. ఇలా చేసిన తరువాత ఒకటి లేదా రెండు రోజులలో మీ యొక్క అక్కౌంట్ ఆక్టివేట్ అవ్వడం జరుగుతుంది. తరువాత మీరు కావాల్సిన మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు.

గమనిక: 

మ్యూచువల్ ఫండ్స్ లో వివిధ రకాల ప్లాన్స్ ఉంటాయి వాటిలో ముక్యంగా తెకుసుకోవాల్సినవి డైరెక్ట్ ప్లాన్ మరియు ఇండిరెక్ట్ ప్లాన్. డైరెక్ట్ ప్లాన్ అంటే మీకు మరియు మ్యూచువల్ ఫండ్ కంపెనీ కి మద్య ఎటువంటి ఏజెంట్లు వుండరు మీరు ఎవ్వరికీ కమిషన్ చెల్లించాల్సిన అవసరం కూడా వుండదు. ఇలా ఎటువంటి ఏజెంట్లు మద్యలో లేకుండా డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టలంటే మీరు GROWW యాప్ ద్వారా డైరెక్ట్ ప్లాన్ ఎంచుకొని పెట్టుబడి పెట్టవచ్చు.

ఇండిరెక్ట్ ప్లాన్ అంటే ఒక ఏజెంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం దీనివల్ల మీరు ప్రతినెలా కట్టే లేదా పెట్టుబడి పెట్టె మొత్తం లో కొంత ఏజెంట్ కి కమిషన్ రూపంలో వెళ్తుంది. ఒక వేల మీరు డైరెక్ట్ ప్లాన్ ద్వారా సులువుగా కమిషన్ చెల్లించ కుండ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే GROWW యాప్ ద్వారా పెట్టుబడి పెట్టండి.

ఈ ఆర్టికల్ చదివినందుకు మీకు మా హృదయపూర్వక దాన్యవాదములు. ఇలాంటి సమాచారం మరింత తెలుసుకోవడానికి Finance School Blog ని ఫాలో అవుతూ ఉండండి.

Finance School Blog (English) - www.financeschoolblog.in

Finance School Blog Telugu - www.telugu.financeschoolblog.in


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా...

పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?

ఒక్క సంవత్సరం లో దాదాపు 130% రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇదే...