Featured Post

ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి ?

చిత్రం
ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా కొంచం స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉండాలి. ఇండియా స్టాక్ మార్కెట్ లో ముక్యంగా రెండు స్టాక్ ఎక్స్చైంజెస్ ఒకటి బి‌ఎస్‌ఈ మరొకటి ఎన్‌ఎస్‌ఈ, బి‌ఎస్‌ఈ అంటే బాంబె స్టాక్ ఎక్స్చైంజ్, అలాగే ఎన్‌ఎస్‌ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చైంజ్ ఈ రెండు స్టాక్ ఎక్స్చైంజెస్ లో వివిద రకాల ఇండెక్సెస్ ఉంటాయి, వాటిలో ముక్యమైన ఇండెక్సెస్ సెన్సెక్స్ మరియు నిఫ్టీ, బి‌ఎస్‌ఈ లో ఉన్న కంపనీలలో మార్కెట్ కాపిటల్ ప్రకారంగా మొదటి 30 కంపెనీలను కలిపి సెన్సెక్స్ ఇండెక్స్ అంటారు. అలాగే మార్కెట్ కాపిటల్ ని ఆదారంగా నిఫ్టీ లోని మొదటి 50 కంపెనీలను కలిపి నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారు. స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50  నే కాకుండా వివిద రకాల ఇండెక్స్ లు ఉంటాయి వాటి గురించి రాబోయే ఆర్టికల్స్ లో తెలపడం జరుగుతుంది.  ఈ ఆర్టికల్ లో నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఉన్న కంపెనీల జాబితాను పొందుపరిచాం గమనించండి. నిఫ్టీ 50 లో ఉన్న కంపెనీల జాబితా: ( మీరు రిసర్చ్ చెయ్యడానికి సులబతరంగా ఉండడం కోసం కంపెనీల పేర్లను ఆంగ్లం లోనే ఉంచడం జరిగింది) 1.Reliance Industries Ltd. 2.HDFC Bank Ltd. 3.Infosys Ltd. 4.Hou

పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?





ఈ రోజుల్లో చాలా పనులకు పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఏదైనా ఒక బ్యాంక్ లో కొత్తగా అక్కౌంట్ తెరవాలి అంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే రూ 50,000 మరియు అంతకు మించి  డబ్బును బ్యాంకు ద్వారా ఒకేసారి ఒక అక్కౌంట్ నుంచి మరొక అక్కౌంట్ కి పంపాలి అంటే పాన్ కార్డ్ నెంబర్ తప్పనిసరి, అలాగే ఎవరైనా స్టాక్ మార్కెట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి అంటే పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి.

పాన్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్  చేసుకోవాలి:

భారత ప్రభుత్వం ఒక మనిషికి ఒక పాన్ కార్డ్ మాత్రమే జారీచేస్తుంది, ఒక వేల ఎవరి దగ్గర ఐనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు వునట్లు అయితే వారికి 10,000 రూపాయల వరకు జరిమానా విదించే అవకాశం వుంది. ఒక వేల మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు వుంటే వెంటనే సంబందిత కార్యాలయానికి వెళ్ళి సరిచేసుకోవచ్చు.

మీరు కొత్తగా పాన్ కార్డ్ కి అప్లై చేసివుండి ఇంకా పాన్ కార్డ్ మీ ఇంటికి చేరనట్లు అయితే మీరు పాన్ కార్డ్ ని ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఒకవేళ పాన్ కార్డ్ ఇదివరకే పొందిఉండి దానిని ఎక్కడైనా పోగొట్టుకొని ఉంటే మళ్ళీ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇలా చేయండి:

1.  మొదటగా ఇక్కడ ఇచ్చిన డౌన్లోడ్ పాన్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయండి Download Pan Card

2. తరువాత, మీరు ఒక వేల కొత్తగా పాన్ కార్డ్ కి అప్లై చేసివుంటే ACKNOWLEDGEMENT NUMBER  పైన క్లిక్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒక వేల మీకు పాన్ కార్డ్ ఇదివరకే ఉన్నట్లైతే పాన్ నెంబర్ పైన క్లిక్ చేసి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి.

3. మీరు ఒక వేల ACKNOWLEDGEMENT NUMBER ఇచ్చి వుంటే, డేట్ ఆఫ్ బర్త్ అలాగే బర్త్ ఇయర్ ఎంటర్ చేయండి. మీరు ఒక వేల పాన్ నెంబర్ ఎంటర్ చేసినట్లైతే ఆధార్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ నెల మరియు సంవత్సరం ఎంటర్ చేయండి.

4. తరువాత టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఆక్సెప్ట్ చేసి, అక్కడ కనిపించిన CAPTCHA నమోదు చేయండి.

5. తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి.

6. తరువాత మీ E-MAILలేదా మొబైల్ నెంబర్ సహాయం తో మీ యొక్క పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి.

గమనిక:

ఒకవేళ మీరు కంపెనీ యొక్క పాన్ కార్డ్ ని డౌన్లోడ్ చెయ్యాలి అనుకుంటే మీరు మీ కంపెనీ యొక్క GSTIN నెంబర్ ని నమోదు చేయాల్సి ఉంటుంది, అయితే GSTIN నెంబర్ ఆప్షనల్ మాత్రామే.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండిలా...

ఒక్క సంవత్సరం లో దాదాపు 130% రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇదే...